అనంతపురం హోమ్

రూ.కోట్లు కొల్లగొట్టిన దాల్ మిల్ సూరి అరెస్టు

#PuttaparthyPolice

శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులు, వ్యాపారులను కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన నిందితుడు దాల్ మిల్ సూరిని పోలీసులు వరంగల్‌లో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ వెల్లడించారు. వ్యాపారాల ముసుగులో భారీ స్థాయిలో మోసాలు చేసిన సూరి గత ఆరు నెలలుగా పరారీలో ఉన్నాడు.

నిందితుడు మోరిమి శెట్టి సురేష్ అలియాస్ దాల్ మిల్ సూరి (53) శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందినవాడు. రైతులకు అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి వారి వద్ద నుంచి ధాన్యాలను అప్పుగా తీసుకొని చెల్లింపులు చేయకుండా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలో సూరిపై 26 కేసులు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో 26 కేసులు నమోదయ్యాయి. కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సహా మొత్తం 57 కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. వైట్ కాలర్ నేరాలు, భూ వివాదాలు, ఎస్సీ/ఎస్టీ కేసుల్లో కూడా నిందితుడికి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో బయటపడిందని తెలిపారు.

ఈ నేరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పోలీసు శాఖ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసింది. దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. నిందితుడు పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు దానిని డిస్మిస్ చేసింది.

నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.300 కోట్ల మేర మోసం చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులు ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

Satyam News

జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ది

Satyam News

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

Satyam News

Leave a Comment

error: Content is protected !!