పౌరాణిక నాటకాలలో రాణించి గతంలో అనేకమందిచ్చే శభాష్ వన్స్ మోర్ అనే విధంగా చప్పట్లతో సంతోషపడిన రంగస్థల కళాకారులు నేడు సరైన ఆదరణ లేక కనుమరుగవుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందని పలువురు రంగస్థలం కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతరించిపోతున్న పౌరాణిక నాటక రంగానికి ఊపిరి పోసే విధంగా కర్నూల్లో శనివారం చింతల ముని దేవాలయం దగ్గర జరిగిన పంచమాంకములు పౌరాణిక నాటక ప్రదర్శనలో భాగంగా శ్రీకృష్ణతులాభారం నాటకంలో అలక శీను ప్రదర్శించి ఎర్రవల్లి మండలం శాసనూల్ గ్రామానికి చెందిన నంబి శ్రీధర్ శ్రీకృష్ణ పాత్రలో ఇమిడిపోయారు.
సత్యభామ వేషధారణలో రాధిక హొయలు ఒలికించారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో వన్స్ మోర్ అంటూ నాటకాన్ని తిలకించారు. సంగీతం రాజశేఖర్ రాజు అందించగా ఇంకా శంకర్ రెడ్డి రాజశేఖర్ రావు ఈ నాటకంలో పాత్రలు పోషించారు. అలాగే సుబ్బిశెట్టి పాత్రలో గద్వాల ఆర్టీసీ డ్రైవర్ యం వెంకటేశ్వర్లు రాణించారు.