మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి బిగ్ బాస్ 9 కాంటెస్టెంట్ ఫ్లోరా శైని సెల్యూట్ కొట్టారు. ఫ్లోరా శైని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చి కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం అన్నారు. పేరులోనే ఫ్లవర్ ఉంది అని మొక్కలు అంటే చాలా ఇష్టం అని అన్నారు.
కాంక్రీట్ జంగల్ అయింది చెట్లు అంతరించి పోతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమం రేపటి తరాలకు మంచి ఆక్సీజన్, మంచి ప్రకృతి ని అందచేసేలా పని చెయ్యడం గొప్ప విషయం అన్నారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ ఫ్లోరా కి మొక్కను, వృక్ష వేదం పుస్తకాన్ని అందచేయడం జరిగింది.
ఇంతటి గొప్ప కార్యక్రమం ఒక యజ్ఞం లా ప్రతీ ఒక్కరిని మమేకం చేస్తూ ప్రకృతి కోసం పని చేస్తున్న ప్రకృతి ప్రేమికులు సంతోష్ కుమార్ కి సెల్యూట్ చేసారు.