వనపర్తి జిల్లా కేంద్రంలో లక్షల్లో అద్దె పొందుతున్న కొన్ని భవనాలకు ఆస్థి పన్ను వేలల్లో ఉంటుందని పిర్యాదులు ఉన్నా కాని చర్యలు లేవు. ఇంకా కొన్ని భవనాల్లో విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు ఉన్నా టాక్స్ తక్కువ ఉందని తెలిసినా, పిర్యాదు చేసినా తనిఖీ లేదు. ఎవరైనా ధైర్యంగా పిర్యాదు చేస్తే పలానా వ్యక్తి పిర్యాదు చేశారు, భవనం తనిఖీ చేసి, టాక్స్ నిర్ణయం చేస్తామని చెప్పడం సిబ్బందికి అలవాటు.
పాత భవనాలు కూలగొట్టి కమ్మర్షియల్ భవనం నిర్మాణం చేసినా పాత టాక్స్ ఉంటుంది. ఇంకా కొన్ని కొత్త భవనాలు నిర్మాణం చేసినా అసెస్ మెంట్ చేయరు. ఇంటి నంబర్ ఇవ్వరు. వారి నుండి టాక్స్ వసూలు చేయరు. కాని అలాంటి భవనాలకు కమ్మర్షియల్ కేటగిరి కరంటు మీటర్ ను పెట్టుకుని కాపురాలు చేస్తున్నా పట్టించుకోరు. అస్సేస్మెంట్ చేయరు. పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మాణం చేసినా అండర్ అసెస్ మెంట్ చేయరు. కొత్త టాక్స్ రాదు. పాత టాక్స్ ఉంటుంది.
అదే విదంగా మైయిన్ రోడ్ల ప్రక్కన రేకుల షెడ్లు నిర్మాణం చేసినా షెడ్లకు అసెస్ మెంట్ ఉండదు. కొత్త టాక్స్, భవనం ఇంటి నంబర్ ఉండదు. టాక్స్ వసూలు చేయరు. అలాంటి షెడ్లకు కరంటు ఉంటుంది. అద్దెకు ఇచ్చినా పట్టించుకోరు. ఇంకా కొన్ని షెడ్లకు ఇంటి నంబర్ ఉండటం వల్ల టాక్స్ తక్కువగా ఉంటుంది.
అన్ని ప్రాంతాల్లో కొత్త భవనాలు, పాత ఇండ్ల స్థానంలో నిర్మాణం చేసిన కొత్త భవనాలు, రోడ్ల ప్రక్కన రేకుల షెడ్లు, సెల్లార్లను తనిఖీ చేయాలని, అక్రమాలకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. భవన నిర్మాణానికి అనుమతి పొందిన వివరాలపై తనిఖీ చేసి టాక్స్ వసూలు చేయాలని, విద్యా సంస్థలు ఉన్న భవనాలను తనిఖీ చేయాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్