ముఖ్యంశాలు హోమ్

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

#secretariat

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ‌తంలో బ‌దిలీ చేసిన కొంద‌రు అధికారుల‌కు ఈ రోజు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జెన్కో మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఎస్‌.నాగ‌ల‌క్ష్మిని నియ‌మించారు. సి.ప్ర‌శాంతిని పున‌రావాస డైరెక్ట‌ర్‌గానూ, బి.ఆర్‌.అంబేద్క‌ర్‌ను స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేష‌న్ జ‌న‌ర‌ల్‌గానూ, శ్రీ‌ధ‌ర్ చ‌మ‌కూరిని ఎక్సైజ్ & ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా నియ‌మించారు. 

ఇక అమిలినేని భార్గవ్ తేజ ను మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార (APCRDA) అదనపు కమిషనర్‌గా నియమించారు.  కట్ట సింహాచలం (IAS-2019) ను ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డు (KVIB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, మోగిలి వెంకటేశ్వర్లు ను నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమించారు.

ఈ నియామకంతో పాటు, డా. మల్లికార్జున ఎ. కు బి.సి. సంక్షేమ డైరెక్టర్ బాధ్యతలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం బదిలీ అయి కొత్త పోస్టింగ్ ఇవ్వని అధికారుల నియామక ఉత్తర్వులు త్వరలో విడిగా జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

Related posts

దివ్య క్షేత్రంగా శ్రీశైలం ఆలయ అభివృద్ధి

Satyam News

వై గూగుల్ గూగుల్డ్ వైజాగ్!

Satyam News

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!