ఆధ్యాత్మికం హోమ్

శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో సంప్రోక్షణ

#DevuniKadapa

దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం ఉద‌యం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగ‌ష్టు 20వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఉద‌యం 8 గంట‌లకు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, శాంతి హోమం, వాస్తు హోమం నిర్వ‌హించారు.

సాయంత్రం 5.30 గంట‌ల‌కు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి మూల‌మూర్తి శ‌క్తిని కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌లో ప్ర‌తిష్టించి ఆరాధ‌న‌లు చేప‌డ‌తారు. ఆగ‌స్టు 20వ తేదీన‌ ఉద‌యం 9.30 గంట‌లకు మ‌హాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ‌ ప్ర‌తిష్ట‌, బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో ప్ర‌శాంతి, సూప‌రిండెంట్ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ ఈశ్వ‌ర్ రెడ్డి, అర్చ‌కులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Satyam News

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వాన

Satyam News

Leave a Comment

error: Content is protected !!