రంగారెడ్డి హోమ్

ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటన

బార్బడోస్ దేశంలో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ అనంతరం స్టడీ టూర్లో భాగంగా ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటిస్తున్నది.

ప్యారిస్ లోని భారతదేశ రాయబార కార్యాలయంలో చీఫ్ అంబాసిడర్ సంజీవ్ సింఘాలా తో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులతో కూడిన తెలంగాణ రాష్ట్ర శాసన బృందం సమావేశమైంది.

ఈసందర్భంగా తెలంగాణ శాసన బృందం మాట్లాడుతూ…. భారతదేశంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని తెలిపారు. తెలంగాణ రైజింగ్ మోటోతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.

అదే విదంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నందున పర్యాటక, ఆతిధ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా ఉంటూ ఐటీ ఎగుమతులలో రెండవ స్థానం, బల్క డ్రగ్స్ ఎగుమతులలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని వివరించారు.

వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానం అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి వాతావరణం, అనుకూలత ఉన్నాయని తెలిపారు.

రాయబారి సింఘాలా మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఫ్రాన్స్ దేశానికి పర్యాటకులు బాగా వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు తమవంతుగా ప్రయత్నం చేస్తామని సింఘాలా తెలిపారు.

ఈసందర్భంగా రాయబారి సింఘాలా ని పోచంపల్లి పట్టు శాలువాతో తెలంగాణ శాసన బృందం సన్మానించింది.

Related posts

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News

గ్రహణం రోజున ముస్లింల ర్యాలీ…!

Satyam News

Leave a Comment

error: Content is protected !!