పులివెందుల లోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ & లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ ( IGGAARL) ను జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ సందర్శించారు. వీరితో పాటు బెంగుళూరు కాన్సుల్ జనరల్ అమిత దేశాయ్, కే ఎఫ్ డబ్ల్యు బ్యాంకు నుంచి నాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సంగీత అగర్వాల్ కూడా అకాడమీ ని సందర్శించారు.
అకాడమీ లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం తో పాటు అకాడమీ లో చేపడుతున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు,అకాడమీ ద్వారా సాధిస్తున్న ఫలితాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫార్మర్ సైంటిస్ట్ మరియు మెంటార్ కోర్స్ లను అభ్యసిస్తున్న రైతు శాస్త్రవేత్తలు,మెంటార్లు,యంగ్ రీసెర్చ్ ఫెలోస్ మరియు ఇంటర్న్ లతో ముచ్చటించారు.
అనంతరం ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ & లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ ( IGGAARL) లో ప్రకృతి వ్యవసాయ చక్రం ద్వారా సాగు పద్ధతులు,మరియు రైతు సాధికార సంస్థ వారిచే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ సందర్శించ గా,మిల్లెట్ తో తయారు చేసిన ఆహార పదార్థాలు,మిల్లెట్ వాడకం వల్ల కలుగు ప్రయోజనాలను సవివరంగా వివరించ గా వారిని అంబాసిడర్ అభినందించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ & లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ ( IGGAARL) ద్వారా చేస్తున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, అకాడమీ ఏ ఓ శివారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్ర నాయక్, ఎపిసిఎన్ఎఫ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు