కోనసీమ జిల్లాలో బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాయవరం మండలంలోని కొమరిపాలె గ్రామంలో ఉన్న లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ దుకాణంలో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయినట్లు ప్రాథమిక సమాచారం.
ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ప్రకారం, బాణాసంచా తయారీ పనులు కొనసాగుతున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భీకరంగా వ్యాపించి దుకాణాన్ని చుట్టుముట్టాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.