మూల రామాయణ రచయిత, సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలలో టిడిపి యువ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నేడు పాల్గొన్నారు. మంగళవారం రోజు ఉదయం శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల వాల్మీకి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అదే విధంగా లక్కిరెడ్డిపల్లి మండలం హై స్కూల్ నందు జరిగిన శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలలో అధ్యాపకులు విద్యార్థులు మరియు మండల టిడిపి నాయకులతో కలిసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహా పురుషుని జయంతిని జరుపుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. ఆదర్శ జీవితాన్ని గడపడానికి మానవులు ఆచరించాల్సిన ధర్మాలన్నిటినీ శ్రీ రామాయణ మహాకావ్యంలో పొందుపరచిన ఆదికవి వాల్మీకి జయంతిని అందరూ కలిసిమెలిసి చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీఐఐసీ డైరెక్టర్ కొండ భాస్కర్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ షఫీ నాయక్, వైస్ చైర్మన్ మల్లికార్జున, మండల నాయకులు మదన్మోహన్, ఉమాపతి రెడ్డి, ఆరిఫ్, దళిత వేదిక ఓబులేసు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.