రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్ అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేడ్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనను మంత్రి స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ……ఈ ఘటన జరగడం దురదృష్టకరం, జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇప్పటికే సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఈ రోజు సాయంత్రం లోపు కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడొద్దు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
previous post