ముఖ్యంశాలు హోమ్

42 % రిజర్వేషన్ లతో నే స్థానిక సంస్థల ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు అడ్డు తొలగింది. బీసీ రిజర్వేషన్లు ఉన్న ఎన్నికల నోటిఫికేషన్‌ కు స్టే ఇవ్వాలన్న కేసులో పాలక కులాల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అక్టోబర్ 9 (గురువారం ) న నోటిఫికేషన్‌ వెలువడి నామినేషన్ల పని మొదలవుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్‌, నామినేషన్ల ప్రక్రియపై అందరూ సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వాలు ,పాలక కులాలు ముందే బాదురుకుని ,ఇంద్రా సహాని కేసులో సుప్రీం కోర్టు దాదాపు నాలుగు దశాబ్ధాల కింద ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ప్రతి సారి బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ వచ్చాయి. రాహుల్ గాందీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జి‌.ఓ ద్వారా బీసీ రిజర్వేషన్లను పెంచి ఈ ఎన్నికలు నిర్వహించడం గమనార్హం.42 % రిజర్వేషన్ల పై చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.మూడు రోజుల కింద సుప్రీం కోర్టు కేసు విచారించడానికి నిరాకరించడంతో బీసీ లల్లో నమ్మకం కుదిరింది.మొత్తం మీద 42 % రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పని 75 ఏళ్ల క్రితమే చేయాల్సి ఉండే.దాదాపు మూడు తరాలుగా బీసీలు ఈ విషయంలో బాగా నష్ట పోయారు.

Related posts

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Satyam News

లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

Satyam News

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News

Leave a Comment

error: Content is protected !!