చిత్తూరు హోమ్

ఇదీ రాజకీయమేనా? ఇలా ఎంతకాలం? 

#JaganReddy

వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మహాశయుడు అంబేద్కర్ ను అవమానించింది. అంతేకాదు దళితుల ఆస్తిత్వంతో వైసీపీ నేతలు ఆటాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ఎప్పటికీ మర్చిపోరు. అసలు ఏం జరిగింది అంటే…  ఈ అక్టోబర్ నెల 2న రాత్రి చిత్తూరు జిల్లా, దేవళంపేటలో ఓ  పూరిపాకకు నిప్పు అంటుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆ పాకలో దుకాణం నడుపుతున్న సులోచన అనే మహిళకు సమాచారమిచ్చారు.

ఆమె వైకాపా సర్పంచి గోవిందయ్యకు ఫోన్లో చెప్పారు. ఈలోపు మంటలు వ్యాపించి దగ్గర్లోనే ఉన్న అంబేద్కర్ విగ్రహం కొద్దిగా కాలింది. ఇది చూసిన గోవిందయ్యలో కుల చిచ్చు రాజేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. వెంటనే చకచకా ఓ దుర్మార్గపు నాటకానికి స్క్రిప్ట్ రాసుకున్నాడు. “నువ్వేం మాట్లాడకు. కాలిపోయిన దుకాణానికి బదులు నీకు నేను  పంచాయతీలో కొత్తది కట్టిస్తా” అంటూ మహిళను మభ్యపెట్టాడు.

” దీన్ని ఎలా ముగించాలో తెలుసు. నేషనల్ లెవెల్లో హైలైట్ చేయిస్తా.. వైకాపా నేతలతో ధర్నా చేయిస్తా.. అప్పుడు నేను ఎవరి పేర్లు చెబితే వారి పేర్లే పోలీసులు ఎఫ్ఐఆర్లో పెట్టి, అరెస్టు చేస్తారు.” అని ఆ మహిళతో చెప్పాడు. ఒకప్పుడు తన చెక్ పవర్ ను రద్దు చేయించిన టీడీపీ నేత సతీష్ నాయుడి పై గోవిందయ్యకు కక్ష ఉంది. అందుకే అతనే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టాడని గోల చేసాడు.

విషయం తెలిసి నగరి డిఎస్పీ అక్కడికి వెళ్లగా ఆయన కాళ్ళు పట్టుకుని దళితులకు న్యాయం చేయమంటూ నాటకాన్ని రక్తి కట్టించాడు. ఒక్కడే ఏకపాత్రాభినయం చేస్తున్నాడని తెలుసుకున్న  మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఆయన కుమార్తె కృపాలక్ష్మి అక్కడికి వచ్చి తలా కొన్ని డైలాగులు పంచుకున్నారు. ఇలా ఒకరివెంట ఒకరు వైసీపీ నేతలంతా వచ్చి డ్రామాలో జాయిన్ అయ్యారు.

చివరికి చిత్తూరు జిల్లా కమల్ హాసన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి తన నటనతో డ్రామాను ఒక లెవల్ కి తీసుకువెళ్లాడు. అయితే టెక్నాలజీ ఈ దొంగ నటులను పట్టిచ్చింది.  పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలు, కాల్స్ లిస్టును విశ్లేషించి, సాంకేతిక ఆధారాలతో గోవిందయ్య పన్నిన కుట్రను కనిపెట్టారు. చివరికి గోవిందయ్య అరెస్ట్ అయ్యాడు. జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో 220 మంది దళితులు హత్యకు గురయ్యారు.

637 మంది దళిత మహిళలపై  అత్యాచారాలు జరిగాయి. సాగులో ఉన్న 11,000 ఎకరాల దళిత భూములను లాక్కున్నారు. టీడీపీ అమలు చేసిన 28 దళిత పథకాలను తీసేసారు. దళిత డాక్టర్ సుధాకర్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణాలను ఏపీ ప్రజలెవరూ మర్చిపోలేదు. ఇప్పుడు రాజకీయ విలువలకు నిప్పు పెట్టి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించారు వైసీపీ నేతలు.

అసలు  ఆ పూరిపాక ఎలా అంటుకుంది? ప్రమాదవశాత్తు అంటుకుందా? లేక  కుట్రలో భాగంగా పూరిపాకకు కావాలనే నిప్పు పెట్టారా? అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి పెద్ద ఎత్తున ఇంకేదైనా ప్లాన్ చేసారా? అసలు ఈ నాటకం గోవిందయ్య మొదలు పెట్టాడా? లేక వైసీపీ పెద్దల నుంచి పై స్థాయిలో స్క్రిప్ట్ రచన జరిగిందా? మున్ముందు నిజాలు తెలుస్తాయి.

Related posts

శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో సంప్రోక్షణ

Satyam News

బీచుపల్లిలో రేపు శ్రీ సీతారాముల కళ్యాణం

Satyam News

హంద్రీ నీవా నీటికి జలహారతి

Satyam News

Leave a Comment

error: Content is protected !!