చిత్తూరు హోమ్

వైసిపి కోవర్టుల అరాచకాలకు చెక్

#Tirumala

తిరుమల తిరుపతి దేవస్థానంలో తమకు 2000 మంది కోవర్టులు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉద్యోగుల పనితీరును అనుమానించేలా చేసిన ఆరోపణ పై టిటిడి బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.

తిరుమల తిరుపతి లలో ఇటు ఉద్యోగుల్లోనూ స్థానికంగా వైసిపి కార్యకర్తలుగా చలామణి అవుతూ అక్రమంగా ఆస్తులను అనుభవిస్తూ పరోక్షంగా టిటిడి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇంటిలిజెన్స్ వ్యవస్థ ద్వారా గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు ఒక ప్రత్యేక జాబితా రూపొందించబడింది.

మొదటి విడతగా టిటిడిలోని ఉద్యోగి నుండి అధికారుల వరకు గతంలో వైసిపి తో అంట కాగి అడ్డదారిలో ప్రమోషన్లు కొట్టేసి, సిఫార్సులతో కీలక స్థానాల్లో నెట్టుకొస్తున్న 42 మంది టీటీడీ ఉద్యోగులకు శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించింది. మొదటి విడతగా ఎనిమిది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను కీలక స్థానాల నుండి తప్పిస్తూ బదిలీ చేశారు.

ఏఈఓ స్థాయి అధికారులను ఏఏ స్థానాలకు బదిలీ చేయాలో గుర్తించాలని ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అక్రమంగా ఆస్తులను అనుభవిస్తున్న స్థానిక నేతలు కొందరు టీటీడీకి ఏ విధంగా తలనొప్పిగా మారారో గమనించి వారికి ఏ విధంగా చెక్ పెట్టాలో అదేవిధంగా చర్యలకు ఉపక్రమించారు.

తిరుపతి పద్మావతి ఆసుపత్రి వద్ద గత ఆరేళ్లుగా మెడికల్ షాపు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న ఓ కార్యకర్తకు నామినేషన్ పద్ధతిలో కేటాయించింది. ఒక నెలకు 30 లక్షల రూపాయల అద్దె పలుకుతున్న ఈ మెడికల్ షాపుకు కేవలం నెలకు 65 వేల రూపాయలు మాత్రమే చెల్లించేలా నామినేషన్ పద్ధతిలో మెడికల్ షాపును తమ అనుచరులకు అప్పటి వైసిపి ప్రభుత్వం కట్టబెట్టింది.

దీని ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని స్విమ్స్ ఆసుపత్రి కోల్పోయింది. పైగా టెండర్ గడువు ముగిసిపోయి మూడు మాసాలు కావస్తున్నప్పటికీ ఈ షాపును ఇంకా ఖాళీ చేయకుండా వైసీపీ అనుచరులు కొనసాగిస్తున్నారు.

దీనిపై తాజాగా స్విమ్స్ ఆస్పత్రి మెడికల్ షాప్ నిర్వహణ కోసం టెండర్లు ఆగస్టు నెలలో నిర్వహించింది. ఇందులో ఎక్కువ ధరకు కోట్ చేసిన టెండర్దారుగా ఇన్నోవేటివ్ ఫార్మా షూటికల్ కంపెనీ మొదటి అర్హత సాధించింది. నెలకు 27 లక్షల రూపాయల అద్దెను చెల్లించేలా ఈ కంపెనీ ముందుకు వచ్చింది. అయితే వైసిపి అనుచరుల నుండి ఈ మెడికల్ షాపును ఖాళీ చేయించకుండా కొత్తగా టెండర్ పాడుకున్న సంస్థకు దుకాణాన్ని అప్పగించకుండా కొంతమంది పెద్దలు తెరవెనుక రాజకీయం నడిపారు.

ఇవన్నీ గమనించిన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పూర్తి వివరాలు తెప్పించుకుని స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ తో పాటు టిటిడి బోర్డు సభ్యులతో కూడా చర్చించారు. స్వయంగా స్విమ్స్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహించాల్సిన ఈ మెడికల్ షాపును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆసుపత్రి యాజమాన్యానికి చురకలంటించారు.

నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ షాప్ నిర్వహణ కోసం స్విమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తగిన సిబ్బందిని నియమించుకుని స్వయంగా మెడికల్ షాపును నిర్వహించాలని చైర్మన్ ఆదేశించారు.

ఇందుకోసం అవసరమైన నిధులను పాలకమండలిలో చర్చించి విడుదల చేస్తామని ఎట్టి పరిస్థితులను ప్రైవేటు వ్యక్తులకు రాజకీయ పార్టీల అనుచరులకు అవకాశం లేకుండా స్విమ్స్ ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు ఆసరాగా నిలబడి నాణ్యమైన మందులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. రెండు వారాల్లోగా ఈ పద్మావతి ఆసుపత్రి వద్ద ఏర్పాటుచేసిన మెడికల్ షాప్ సిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

దీంతోపాటుగా తిరుమల కొండపై రెవెన్యూ పంచాయతీ కార్యాలయంలో కొంతమంది వైసిపి కోవర్టులు అధికారులతో కుమ్ముకై అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా సమాచారం ఉంది. షాపులు ఆఖరు లైసెన్సులు వాటి పేర్ల మార్పిడి తదితర అంశాలపై మధ్య దళారీలుగా వ్యవహరించి కొంతమంది వైసిపి పేటీఎం బ్యాచ్ టీటీడీ వ్యవస్థను బ్రష్టు పట్టించినట్లు విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించారు.

ఈ మేరకు వివరాలు సేకరించిన టిటిడి విజిలెన్స్ కొండపై దాదాపు పదిమంది స్థానిక వైసిపి నేతలు టిటిడి కి వ్యతిరేకంగా కొంత సమాచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డికి అందిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇలా స్థానిక వైసీపీ కోవర్టులుగా చలామణి అవుతున్న స్థానిక నేతల పూర్వాపర వ్యవహారాలపై పూర్తి వివరాలను సేకరించి వారి అక్రమాలకు చెక్ పెట్టడమే కాకుండా కొండ దించే ప్రయత్నాలను చేస్తున్నారు.

Related posts

అమరావతిలో మరో సంచలనం….

Satyam News

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!