ఆధ్యాత్మికం హోమ్

గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా అయోధ్య లో 9వ దీపోత్సవం

దీపావళి సందర్భంగా అయోధ్య నగరం మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది. దీపావళి రోజున అయోధ్యలో తొమ్మిదవ ‘దీపోత్సవం’ (దీపాల పండుగ) అత్యంత వైభవంగా జరగనుంది.

గత ఏడాది దీపోత్సవంలో దీపాలు వెలిగించి ఇప్పటికే గిన్నిస్ రికార్డ్ సాధించిన అయోధ్య, ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరంలోని 56 ఘాట్లలో ఏకంగా 28 లక్షల ప్రమిదలను వెలిగించనున్నారు.

ఈ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటే, అయోధ్య మరోసారి ప్రపంచంలోనే అత్యధిక దీపాలను ఒకే చోట వెలిగించిన ఘనతను సాధించి గిన్నిస్ రికార్డ్‌ను తన సొంతం చేసుకోనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Related posts

తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి

Satyam News

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు

Satyam News

హృద్రోగానికి తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్

Satyam News

Leave a Comment

error: Content is protected !!