విశాఖపట్నం హోమ్

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన

#Rain

దక్షిణ అండమాన్ సముద్రం,ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఆతదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళాఖాతం,పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.

దీని ప్రభావంతో మంగళవారం(21-10-25) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Related posts

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News

నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Satyam News

Leave a Comment

error: Content is protected !!