విజయనగరం పోలీసులు దీపావళి పండగ రోజునే లాఠీకి పని చెప్పారు. అదీ రాత్రి ఎనిమిది తరువాత రోడ్లపై అటు వాహనదారులకు, ఇటు పబ్లిక్ కు ఇబ్బంది కలిగించేలా తారాజువ్వల పోటీలపై ఉక్కు పాదం మోపారు. విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అంబటి సత్రం, పుచ్చలవీధి, బుచ్చన్నకోనేరు, పాత బస్టాండ్, అద్దేపల్లి వారి వీధి, టెంపుల్ స్ట్రీట్ లలౌ సీఐ శ్రీనివాస్ క్రైమ్ పార్టీ సిబ్బంది రవి, కాశీ, ఎస్ఐ కృష్ణమూర్తి తో లాఠీలకు పని చెప్పారు.
నడిరోడ్ పై తారాజువ్వలను వెలిగించి పోటీలుగా కాల్చుతున్న యువతకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. పుచ్చలవీధికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కొంతమంది పొలిటికల్ నేతలు సీఐ శ్రీనివాస్ కు ఫోన్ చేసి వదిలేయండి సీఐ సార్ అంటూ ఫోన్లు చేయడం విశేషం. కానీ సీఐ శ్రీనివాస్.. యముడు సినిమా లో హీరో సూర్య లా లాఠీకి పని చెప్పి నిఖార్సైన పోలీస్ లా తన కర్తవ్యం నిర్వర్తించారు.