ప్రస్తుతం వర్షాలు కురుస్తూ పంటలు ఏపుగా గుబురుగా పెరిగిన పరిస్థితుల్లో రైతు సోదరులు రైతు కూలీలు పొలాల గట్లపై పొలం సాళ్ళలో చూసుకొని నడవాలని ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ కోరారు.
వ్యవసాయ ప్రాంతమైన హొలగొంద చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రస్తుతం పత్తి మిరప పంటలు పెద్ద ఎత్తున సాగు చేశారని ప్రతిరోజు పత్తి తీయడం కోసం అదేవిధంగా మిరపలో వ్యవసాయ పనుల కోసం రైతు కూలీలు రైతులు పొలాల్లో తిరుగుతున్నారని అయితే వర్షాలు కురిసి గడ్డి గుబురుగా పెరిగిన ప్రాంతాలలో పాములు తేళ్లు వంటి విషపురుగులు సంచరించే అవకాశం ఉన్నందున కొత్త ప్రదేశంలో అలికిడి లేకుండా వెళ్ళరాదని సూచించారు.
అదేవిధంగా పత్తి పొలంలో చెట్లు గుబురుగా పెరిగి ఉన్నందున చెట్టు మొదళ్ళలో కూడా ఉండే అవకాశం ఉందని కాబట్టి పత్తి తీయడానికి వెళ్లే మహిళా కూలీలు ఒకసారి జాగ్రత్తగా చుట్టుపక్కల పరిస్థితులను గమనించుకొని పనులు చేసుకోవాలని దురదృష్టవశాత్తు పాము తేలు కొరికితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇబ్బందులు పడాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఉండడం మేలని తెలియజేశారు.