హైదరాబాద్ హోమ్

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

#PonnamPrabhakar

హైదరాబాద్ యూసుఫ్ గూడా  కోట్ల విజయ భాస్కర్ రెడ్డి  స్టేడియంలో జీహెచ్ఎంసీ పరిధిలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు  వడ్డీలేని రుణాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, సీతక్క పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బలమురి వెంకట్,ఎమ్మెల్యే జారే ఆది నారాయణ , కార్పొరేషన్ చైర్మన్లు బండ్రూ శోభారాణి , బెల్లయ్య నాయక్,రాయల్ నాగేశ్వర రావు, వీరయ్య, మల్రెడ్డి రాంరెడ్డి, వెన్నెల గద్దర్ , కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్ధిన్,అజారుద్దీన్ ,నవీన్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన,  సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఇతర ముఖ్య నేతలు, అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల ఆర్థిక వృద్ధి కోసం ఎన్నో పథకాలు ముందుకు తీసుకొచ్చారు. మ‌న ప్ర‌జా పాలన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హైద‌రాబాద్ వ్యాప్తంగా ఉన్న 32,813 సంఘాల‌కు 41 కోట్ల 51 ల‌క్ష‌ల మేర ఈ రోజు వ‌డ్డీలు చెల్లిస్తున్నాము. అంటే ప్ర‌తి మ‌హిళ‌కు 2853 రూపాయాలు వారి ఖాతాల్లో జ‌మ అవుతాయి.

జుబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో 814 సంఘాల‌కు 84 ల‌క్ష‌ల రూపాయాలు వ‌చ్చాయి. మొత్తం 8130 మంది మ‌హిళ‌ల‌కు ల‌బ్ది జ‌ర‌గ‌నుంది. అంటే ఒక్కో మ‌హిళ‌కు వేయి రూపాయాలు జ‌మ అవుతున్నాయి. తీసుకున్న లోన్ల ద్వారా వారు ఆర్దికంగా నిల‌దొక్కుకున్నారు. గ‌త 4 ఏండ్ల‌లో రాజ‌ధాని హైద‌రాబాద్ లో మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీలు ఇవ్వ‌లేదు.

హైద‌రాబాద్ లో ఇందిరా మ‌హిళా శ‌క్తి ద్వారా 35 క్యాంటిన్లు, 80 కుట్టు మిష‌న్ల యునిట్లు, 63 ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్లు ఏర్పాటు అయినవి. 760 గ్రూపుల‌కు 55 కోట్ల 72 ల‌క్ష‌ల రుణాలు ఇచ్చాము. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళాసంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం.. ఎన్నో పథకాలు అందిస్తున్నాం.. ఇందిరా గాంధీ వారసులుగా మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే..

గత 10 సంవత్సరాలుగా కొత్తగా ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 41 వేల మంది కొత్త రేషన్ కార్డులు అందివ్వడమే కాకుండా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం 222 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించాం.. 7400 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం అందించాం..ఆ డబ్బుకు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ అందిస్తున్నాం.. ఎన్నో పథకాలు ద్వారా సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నాం అని అన్నారు.

Related posts

ప్రభుత్వ సేవలకు రేటింగ్స్

Satyam News

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

Satyam News

నాయుడుపేటలో ఎన్‌.టి‌.ఆర్‌ విగ్రహ భూమి పూజ

Satyam News

Leave a Comment

error: Content is protected !!