చిత్తూరు హోమ్

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

#BhumanaKarunakarReddy

అసత్యాలతో అప్రతిష్టపాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లే కనిపిస్తున్నది. తిరుపతికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది.

తిరుపతిలో కల్తీ మద్యం కలకలం అంటూ వైసీపీ కార్యకర్తలు ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు తప్పుడు పోస్టులు అని ముందుగా ఊహించని ఎక్సయిజ్ శాఖ అధికారులు, తిరుపతి ఈస్ట్ పోలీసులు సంబంధిత ప్రదేశానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించడంతో బాటు అక్కడి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు అలాంటి సంఘటనే అక్కడ కనిపించలేదు.

దాంతో ఆ పోస్టులు పెట్టిన వారి కోసం వెదుకులాట ప్రారంభించారు. చంద్రశేఖర్ వెంకటేష్—రెవెన్యూ ఉద్యోగి (వైకాపా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వద్ద ఈయన పీఏ) ఈ “ఫేక్ వీడియో ప్రొడ్యూసర్” అని తేలింది. అతను 7న మద్యం కొన్నాడు, 10న అదే షాపు దగ్గర పడి ఉన్న వ్యక్తిని వీడియో తీశాడు. ఆ వీడియోను నవీన్ అనే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడికి పంపాడు. ఇద్దరూ కలసి ఎడిట్ చేసి, “కల్తీ మద్యం తాగి పడిపోయాడు” అని పోస్టు పెట్టారు.

7న “తిరుపతిలో కల్తీ మద్యం కలకలం” 11న “ఎన్ బ్రాండ్ తాగి అపస్మారక స్థితి” 19న “తాగి పడిపోయిన వ్యక్తి” ఇలా మూడు విడతలుగా ‘భయపెట్టే’ ప్రచారం. కానీ ఎక్సైజ్, పోలీసుల విచారణలో తేలింది ఏమిటంటే ఇది కల్తీ మద్యం కాదు, వైకాపా కల్తీ ప్రచారం అని! తిరుపతి వచ్చే భక్తులలో అలజడి సృష్టించేందుకు ‘భూమన బ్రాండ్’ కల్తీ డ్రామా ఆడాడని కూడా పోలీసులకు తెలిసిపోయింది.

స్క్రిప్ట్ రాయించినవాళ్లు, నటించినవాళ్లను అరెస్టు చేశారు. వీళ్ల ‘నాటకీయ నైపుణ్యం’ చూస్తే, ఏదో సినిమా స్టూడియోలో కాకుండా… తిరుపతి రైల్వే కాలనీలోనే ఓ కొత్త “ఫేక్ న్యూస్ స్టూడియో” ప్రారంభించారని అనిపిస్తోంది! కానీ ఫిర్యాధు అంది ఎక్సైజ్ అధికారులకు అడ్డంగా దొరికారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ — వైకాపా నేతల ‘ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ’ పోలీసుల విచారణలో బట్టబయలు అయింది. అరెస్టు చేసిన ఇద్దరి ఫోన్లు చెక్ చేశారు, వీడియోలు ఎడిట్ చేసిన ఆధారాలు దొరికాయి. కేసు నమోదు చేశారు, అరెస్టులు చేశారు. ఇప్పుడు “భూమన బ్రాండ్” ప్రచారంకు… పోలీస్ స్టేషన్‌లోనే ‘ఫుల్ స్టాప్’ పడింది.

Related posts

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు

Satyam News

Leave a Comment

error: Content is protected !!