ప్రత్యేకం హోమ్

విధ్వంసం నుంచి వికాసం వైపు వెళుతున్నాం….

#ChandrababunaiduAmaravati

రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నంద్యాల, కర్నూలు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దాం.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి,” అని అన్నారు. అలాగే, రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మక నిర్ణయంగా గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు కోసం ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం కుదిరిందని తెలిపారు.

“1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కి రావడంతో ఐటీ ఎకోసిస్టం ఏర్పడి నాలెడ్జి ఎకనామీకి పునాది పడింది. ఇప్పుడు గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సాంకేతిక యుగానికి నాంది పలుకుతుంది,” అని ఆయన పేర్కొన్నారు. గూగుల్ పెట్టుబడులు తీసుకురావడంలో ప్రధాన మంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్విని వైష్ణవ్‌, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు.

“అధికారంలోకి వచ్చిన వెంటనే లోకేష్‌ గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి రప్పించారు. $15 బిలియన్ (సుమారు ₹1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏపీలో ఏర్పడుతోంది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి,” అని చెప్పారు. గత పాలకుల తప్పిదాల వల్ల రాష్ట్ర విభజన నాటి కంటే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన విమర్శించారు.

“పాలనా పరంగా అనేక లోపాలు జరిగాయి. వాటిని సరి చేయడానికే చాలా సమయం పట్టింది. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ వంటి కార్యక్రమాలతో మళ్లీ అభివృద్ధి పునాది వేసాం,” అని తెలిపారు. రేపు కర్నూలులో జరగబోయే సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభను కూడా విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. “జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి సుమారు ₹15 వేల ఆదా అవుతుంది.

నెక్స్ట్ జెన్ సంస్కరణలపై నెలలుగా విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం,” అని చెప్పారు. రాయలసీమలో పరిశ్రమలు, ఉద్యాన పంటలు, పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు. “తిరుపతి, శ్రీశైలం, గండికోట వంటి ప్రాంతాలను ప్రపంచస్థాయి టూరిజం డెస్టినేషన్లుగా మారుస్తాం. పోర్టులు, రైల్వే కనెక్టివిటీతో రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతుంది,” అని అన్నారు.

“రేపు ప్రధాని మోదీ రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కర్నూలులో సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామ స్థాయి నుంచి కూటమి మూడు పార్టీల నేతలు సమన్వయంతో ఈ సభను విజయవంతం చేయాలి,” అని సీఎం సూచించారు. “ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మహర్ధశ రాబోతోంది.

తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసి ఉన్న పవిత్ర క్షేత్రంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, ఆనందమయమైన ఏపీ సాధనే మన లక్ష్యం కావాలి,” అని చంద్రబాబు నాయుడు అన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రులు, నేతలు రాష్ట్రానికి గూగుల్ సంస్థను తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ప్రశంసనీయమని అభినందించారు.

Related posts

తాసిల్దార్ వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం

Satyam News

సర్పంచ్ లకు గుడ్ న్యూస్

Satyam News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

Leave a Comment

error: Content is protected !!