కృష్ణ హోమ్

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి నేనున్నానని ముందుకు వచ్చి లోకేష్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో లోకేష్ చేసిన కృషి అభినందనీయం.

లోకేష్ ఏ పని చేసిన చంద్రబాబుల ఆలోచిస్తూ… నిబద్దతతో పూర్తి చేస్తున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారిని గుర్తించడం దగ్గర నుండి వారికి ధైర్యం చెబుతూ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో సైతం ఆయన పాల్గొనలేదు.

యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేసి… తెలుగు వారంతా స్వదేశానికి చేరుకునే వరకు అవిశ్రాతంగా లోకేష్ కష్టపడ్డారు. గుడివాడకు చెందిన పలువురు గల్ఫ్ బాధితులు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంలో లోకేష్ అందించిన సహకారం ఎనలేనిది.

తెలుగువారి సంరక్షణ కోసం లొకేషన్ చేస్తున్న కృషిని అభినందిస్తూ… బాధితుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోకేష్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, గోర్జీ సత్యనారాయణ, పండ్రాజు సాంబశివరావు, కంచర్ల సుధాకర్, మెరుగు మోజేష్, నేరుసు కాశి, వసంతవాడ దుర్గారావు, మరిది రోహిణి కుమార్, గొర్ల శ్రీలక్ష్మి, ఇమాన్యుయల్, కరుణ కుమారి, లారా, ఆదినారాయణ, రజినికాంత్, పెద్దిఇంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఏ మేరకు?

Satyam News

2025 ఆసియా కప్ ఫైనల్: భారత్ ఘన విజయం

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

Leave a Comment

error: Content is protected !!