మైనర్లకు సంబంధించిన ఆక్షేపణీయ కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు E96TV, వైరల్ హబ్ చానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మైనర్ జంట’ ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కావడంతో.. ఐటీ యాక్ట్, బీఎన్‌ఎస్ & పొక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ‘
సోషల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని.. ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదు. చట్టప్రకారం బాధ్యులపై కఠిన చర్యలను పోలీస్ శాఖ తీసుకుంటుంది’ అని సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.