గద్వాల భీం నగర్ లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందు వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
ఉదయము:6- 30 నిమిషాలకు సుప్రభాత సేవతో పాటు అభిషేక, అర్చన కార్యక్రమాలను దేవాలయంలో నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా అదేరోజు సాయంకాలం 6: 30గంలకు స్వామివారికి పుష్పార్చన, ఊoజల్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనీ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని ధర్మకర్తలు కోరుచున్నారు.
స్వామివారు సంతానానికి ఆదిదేవుడు కాబట్టి భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలరు. సాయంత్రం7: 30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కావున భక్తులెల్లరు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు.
ముఖ్య గమనిక : భక్తులందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి రావలెను రావలెను. “సర్వేజనా సుఖినోభవంతు!!”
.