రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మూకుమ్మడిగా పలు షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు మెడికల్ షాపులలో ఆకస్మికంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ప్రవేశించి వారి వద్ద ఉన్న అనుమతులు అదే విధంగా మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఏ మందులు అందుబాటులో ఉన్నాయి పేషంట్లకు ఇలాంటి ప్రిస్క్రిప్షన్ల ప్రకారం మందులు ఇస్తున్నారు వాటికి రసీదులు ఏమైనా ఇస్తున్నారా అన్న విషయాలను మెడికల్ షాపుల యజమానులతో అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు అన్వేష్ రఫీ నాగరాజు విశ్వనాథ్ రెడ్డి తదితరులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీలలో భాగంగా మొత్తం 12 షాపులలో సోదాలు నిర్వహించారు. నిషేధిత మందులు అదేవిధంగా ఏవైనా మందులు కాలం చెల్లినవి స్టోర్స్ లో పెట్టారా అన్న విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వాటిని పరిశీలించారు.