ఆంధ్రప్రదేశ్ హోమ్

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

#Pulivendula

ఊహించిందే జరిగింది. సొంతగడ్డ పులివెందులలో వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సామాన్యులను బెదిరించి దశాబ్ధాలుగా నిర్మించిన అక్రమ సామ్రాజ్యపు కోట బీటలు వారింది. పులివెందులలో తమకు ఎదురేలేదనుకున్న జగన్‌ పరువు గంగలో కలిసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది. వైసీప అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్‌ గల్లంతయిందంటే టీడీపీ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. పులివెందులలో పూర్తిగా వార్‌ వన్‌సైడ్ అయింది.

పులివెందుల ZPTC స్థానంలో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై 6 వేల 35 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్రులకు 100లోపు మాత్రమే ఓట్లు లభించాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచే టీడీపీ హవా కొనసాగింది. వైసీపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

పులివెందులలో దాదాపు 30 ఏళ్ల తర్వాత ZPTC స్థానానికి పోలింగ్ జరిగింది. గతంలో ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారు వైఎస్సార్ ఫ్యామిలీ. కానీ 3 దశాబ్ధాల తర్వాత పోలింగ్ జరగడం ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. వైసీపీ నేతలు బెదిరించినా, దాడులకు పాల్పడినా వెనక్కి తగ్గలేదు. ఇక, వైసీపీ తన సైన్యాన్ని మొత్తం పులివెందులలోనే మొహరించింది. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అన్ని తానై ఇంటింటికి తిరిగారు. ఐనప్పటికీ పులివెందుల జనం టీడీపీకే పట్టం కట్టారు.

టీడీపీ ప్రభంజనాన్ని ముందే ఊహించిన వైసీపీ పోలింగ్ రోజు చేతులెత్తేసింది.రిగ్గింగ్, దొంగ ఓట్లు అంటూ నానాయాగి చేసింది. పలుచోట్ల దాడులకు దిగింది. పులివెందుల ప్రజలు ఓటుతో జగన్‌కు బుద్ధి చెప్పారు. ఇక ఒంటిమిట్టలోనూ ఇదే ఫలితం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related posts

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు

Satyam News

దేవుడి భూములకే ఎసరు పెట్టిన పేర్ని నాని!

Satyam News

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

Satyam News

Leave a Comment

error: Content is protected !!