ఆధ్యాత్మికం హోమ్

దీపావళి సోమవారమా? మంగళవారమా?

భారతీయులకు అత్యంత ప్రాధాన్యత వున్న దీపావళి పర్వదినంపై సంధిగ్ధత నెలకొంది. ఈ సారి దీపావళి పండుగ విషయంలో చాలా మందికి చాలా సందేహాలున్నాయి.

అక్టోబర్ 20 సోమవారం, 21 మంగళవారం ఏ రోజున దీపావళి జరుపుకోవాలి అనే సందేహాలు వస్తున్నాయి. ఈ సందర్బంగా భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య సిద్దాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ వివరణ నిచ్చారు. ధర్మశాస్త్రాలప్రకారం అమావాస్య తిధి, ప్రదోష వ్యాప్తితో వుంటే లక్ష్మి పూజ ఆచరించాలన్నారు.

అమావాస్య తిధి అపరాహ్న వ్యాప్టితో వున్నపుడు దీపావళి జరుపుకోవాలన్నారు. అపరాహ్నం అనగా పితృ కార్యాన్ని ఆచరించే సమయమని, ఆ సమయం మధ్యాహ్నం 1.22 నుంచి 3.22 వరకు ఉంటుందనీ, ఏ రోజయితే పితృ కార్యం ఆచరిస్తారో, ఆరోజే దీపావళి పర్వదినమని గార్గేయ ఉద్ఘాటించారు.

ఈ నేపథ్యంలో 20 సోమవారం అపరాహ్నంలో అమావాస్య తిధి లేదని, 21 మంగళవారం అపరాహ్నంలో అమావాస్య ఉందని, ధర్మ శాస్త్ర నిర్ణయ ప్రకారం 21 మంగళవారం దీపావళి పర్వదినమని స్పష్టం చేశారు. పితృ కార్యం జరుపకుండా దీపావళి ఆచరించరాదని, 20 సోమవారం రాత్రంతా అమావాస్య ఉంటే, ఆరోజే దీపావళి అనుకోవడం పొరపాటని గార్గేయ పేర్కొన్నారు. కంచి స్వామీజీ శ్రీశ్రీశ్రీ విజయంద్ర సరస్వతి స్వామి కూడా 21 మంగళవారం దీపావళిగా ప్రకటించారని గార్గేయ తెలిపారు.

ఇదిలాఉండగా రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల పంచాంగకర్తలు దీపావళి అమావాస్య తిధికి తిథికి రెండు సమయాలు ప్రకటించడంతో భక్తులు అయోమయంలో పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పంచాంగం, శ్రీశైల దేవస్థాన పంచాంగం ప్రామాణికంగా పరిగణిస్తారు. ఈ రెండు పంచాంగాలు ఒకే గణనాపద్ధతిని ఆధారంగా తీసుకున్నా, తిథులలో తేడా రావడం విశేషం.

ఉదాహరణకు తిరుమల పంచాంగం ప్రకారం 2025 అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 1.37 గంటలకు అమావాస్య ప్రారంభమై, అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4.03 గంటలకు ముగుస్తుందని చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా అదే నెలలో శ్రీశైల పంచాంగం ప్రకారం అమావాస్య ప్రారంభం 2.30 గంటలకు, ముగింపు 4.05 గంటలుగా ఉంది.

అంటే ప్రారంభంలో 62 నిమిషాల తేడా, ముగింపులో కేవలం రెండు నిమిషాల తేడా. ఇది స్వల్పంగా కనిపించినా, శాస్త్రీయంగా పెద్ద వ్యత్యాసమేనని పండితులు చెబుతున్నారు. ఒకే దేశంలో, ఒకే రాష్ట్రంలో, రెండు దేవస్థానాలు రెండు రకాల సమయాలు చెబితే ప్రజలు ఎవరిని నమ్మాలనే ప్రశ్న భక్తుల్లో ఉత్పన్నమవుతోంది

ఈ విషయంపై శ్రీనివాస గార్గేయ మాట్లాడుతూ హిందూ ధర్మంలో పంచాంగం అనేది కేవలం తిథుల, నక్షత్రాల లెక్కలు చెప్పే పుస్తకం మాత్రమే కాదని, అదొక జీవన విధాన కాలపట్టిక, ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తుండన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం విని ప్రజలు భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడం ఆనవాయితీ.

శుభకార్యాల నుంచి ప్రభుత్వ నిర్ణయాలదాకా, పంచాంగాన్ని ఆధారంగా చేసుకోవడం భారతీయ సంప్రదాయమని, తాజాగా మార్కెట్‌లో లభిస్తున్న పంచాంగాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. ఏది నిజం? అనే సందేహంలో ప్రజలు చిక్కుకుపోతున్నారన్నారు. ముఖ్యంగా దేవస్థానాలే విడుదల చేసిన పంచాంగాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా తిథులు, ముహూర్తాలు పేర్కొనడం విడ్డురంగా ఉందన్నారు.

ఈ తేడాలు సాధారణ తప్పిదాలు కాదని, ప్రజల విశ్వాసానికి భంగం కలిగించే అంశాలని ఆధ్యాత్మిక వర్గాలు చెబుతున్నాయన్నారు. పండుగలు, ఉపవాసాలు, శుభకార్యాల నిర్ణయాలు పంచాంగం ఆధారంగానే జరిగే నేపథ్యంలో, ఈ తేడాలు సమాజంలో అయోమయాన్ని పెంచుతున్నాయని గార్గేయ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాంగమనేది జ్యోతిష్య, ఖగోళ శాస్త్రల సమ్మేళనమని, చిన్న పొరపాటే పెద్ద అపార్థానికి దారితీయవచ్చుని గార్గేయ అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో తప్పులు కొనసాగితే పండితుల ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా దేవస్థానాల ప్రతిష్ట దెబ్బతింటుదని గార్గేయ విచారం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంచే 14 భాషల్లో రాష్ట్రీయ పంచాంగం పేరుతో ప్రామాణిక పంచాంగం వుంది. ఈ పంచాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని దేవస్థానాలకు వర్తించేలా తక్షణ చర్యలు తీసుకుంటే భవిష్యత్ లో పండుగలలో వ్యత్యాసాలు రానే రావని గార్గేయ ఉద్ఘాటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని గార్గేయ కోరారు.

Related posts

వర్ష బాధితుల్ని పట్టించుకోని మంత్రి దామోదర

Satyam News

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ

Satyam News

Leave a Comment

error: Content is protected !!