ప్రత్యేకం హోమ్

హిందువుల మనోభావాలతో వైకాపా ఆటలు?

#Kanakadurga

వైకాపా అఫిషియల్ పేజీలో మొదటి పోస్టర్ చూసిన క్షణమే గుండె గుదిబండైపోయింది. దుర్గమ్మ కంటే జగన్ బొమ్మ పెద్దదిగా, ఆమెకంటే పైన వైఎస్ బొమ్మ పెట్టి, వేసిన దృశ్యం చూసిన వెంటనే అనుమానం వచ్చింది. ఇది డిజైన్ తప్పిదం కాదు. ఇది దైవాన్ని కించపరిచే ప్రయత్నం. ఇది భక్తి ముసుగులో రాజకీయ కుట్రకు తెరలేపే సంకేతం అని.

తిరుమల హుండీ పరకామణిలో దొంగలించిన డాలర్లతో, కరుణాకర్ రెడ్డి హయాంలో బినామీ పేర్లతో తాడేపల్లి నుండి వ్రాయించుకున్న కోట్లాది ఆస్తుల కథ బయటపడిన వెంటనే, కోట్లాది కోనేటిరాయుని భక్తులు భగ్గుమన్నారు. హుండీ దొంగ దొరికితే.. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకొని, గోరంత టిటిడికి, కొండంత వైకాపా నాయకులు కొట్టేయడం మీద చర్చ జరుగుతోంది. టిటిడి నుండి ఫోకస్ మళ్లించి, విజయవాడ కనకదుర్గమ్మ మీదకి తిప్పాలన్న కుట్రకు తెరతీస్తున్నారని.

ఇంద్రకీలాద్రి కొండ మీద గందరగోళం సృష్టించడానికి, పొద్దున్నే వైకాపా వారిని లైన్లో నిలబెట్టి, భక్తుల ముసుగులో గలాటాకు ప్లాన్ చేసినట్లున్నారు. వెంటనే దానిని పెద్దదిగా చేసి, మళ్లీ అదే వైకాపా అఫిషియల్ పేజీలో వేశారు అనుకొన్నట్లే.

వెంట వెంటనే నిమిషాల వ్యవధిలో రెండు పోస్టులు వేశారు గంట వ్యవధిలో. అంటే ముందుగానే మొదడి పోస్టర్ సిద్ధం చేసి పెట్టుకొని, ఎవరో ఒక అధికార పార్టీ నేత వస్తే.. అమలుచేసి, ఆ విజువల్స్ వెయ్యాలని ముందస్తుగా అన్నీ సిద్ధం చేసుకొన్నారు. గత ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాలలో కూడా వీరు చెయ్యని డ్రామా లేదు. భక్తులకు సకల సౌకర్యాలను కల్పించి, ప్రశంశలు పొందింది ప్రభుత్వం.

ఎరువుల నుండి కొండల వరకు అబద్దాలతో.. కుట్రలతో… తమ పాలాలను కప్పిపెట్టాలనే కుట్రలకు విశ్వప్రయత్నాలు చేస్తూ వైకాపా పడుతున్న ప్రయాస ఎలా వున్నా.. హిందువుల సహనంతో ఆడుకోవడం బాగాలేదు. పాస్టర్ ప్రవీణ్ తాగి యాక్సిడెంట్లో చనిపోతే.. భారతి గారి సన్నిహిత బెన్నిలింగంతో రెచ్చ గొడుతూ మాట్లాడించే కుట్రకు కూడా వైకాపా పాల్పడిన విషయం, ఆయనకు పోలీసులు కౌన్సిలింగ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

Related posts

శత్రువుకు కూడా సాయం చేసిన లోకేష్‌

Satyam News

కామ్రేడ్ సురవరం ఇక లేరు

Satyam News

విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడం దారుణం

Satyam News

Leave a Comment

error: Content is protected !!