నిజామాబాద్ హోమ్

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు

#GulfVictims

ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 12 మంది తెలంగాణ కార్మికులను వెంటనే స్వదేశానికి రప్పించాల‌ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన కార్మికులు జోర్డాన్‌లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేతిలో డబ్బులు లేకపోవడం, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడం వల్ల స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గల్ఫ్ బాధితుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించడం లేదు. ఇది సిగ్గుచేటు. ప్రజల భవిష్యత్తు కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే కదా?” అని హరీష్ ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో వలసలు తగ్గి కార్మికులు తిరిగి స్వదేశానికి వస్తే, కాంగ్రెస్ పాలనలో మళ్లీ వలసలు మొదలయ్యాయని హరీష్ రావు అన్నారు.

ఉపాధి, ఉద్యోగాలు కరువై ప్రజలు ఎడారి ప్రాంతాలకు వలస వెళ్ళే దుస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం’ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారై పాలసీ అంటూ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని ఆయన అన్నారు. “గత 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ పాలసీ, ఎన్నారై పాలసీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు కాలేదు. అడ్వైజరీ కమిటీ ఏమి చేస్తోంది? గల్ఫ్ సంక్షేమ బోర్డుకు, ఎన్నారై బోర్డుకు ఎటువంటి గతి లేదు,” అని హరీశ్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తక్షణం చొరవ చూపి జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులను సురక్షితంగా తెలంగాణకు రప్పించే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున హరీష్ డిమాండ్ చేశారు.

జోర్డాన్‌లో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా, ఈ విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.

జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణ వాసుల వివరాలు ఇవి:

కంపెనీ పేరు: మిలీనియం ఫార్మ్ ఇన్వెస్ట్‌మెంట్… జోర్డాన్

1. మెట్టు ముత్యం, కూచన్‌పల్లి, సోను మండలం, నిర్మల్…B7598882

2. వంగ భాస్కర్, దోమకొండ, జిల్లా, కామారెడ్డి… X8772864

3. వల్గేట్, గంగాధర్, ఎరుగట్ల, నిజామాబాద్… Y4096301

4. మాచర్ల స్వామి, చింతమనపల్లి, కామారెడ్డి… 1769721

5. గుమ్ముల మనోహర్, వెల్కటూరు, జగిత్యాల… U8680235

6.పెండ్యాల మహేందర్, దుబ్బాక, జిల్లా సిద్దిపేట…. P304450

7. గణేష్, కామారెడ్డి..T9302803

8.పెండ్యాల. శ్రీను, నిజామాబాద్… N5813414

9.బొమ్మనమన.పోచయ్య, సిద్దిపేట..P4473238

10. రాజుకుమార్. కామారెడ్డి…. S3387421

11.ముకిం కుంటల డి. నిర్మల్…N4230455

12.నర్సింలు .జగిత్యాల్…R1578896

Related posts

తాతయ్య గుంట గంగ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణస్వీకారం

Satyam News

గో సేవలో ఎక్సైజ్ శాఖ మంత్రి….

Satyam News

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

Leave a Comment

error: Content is protected !!