ఆదిలాబాద్హోమ్

కాంగ్రెస్ వేధింపులతో బిజెపి నాయకుడు ఆత్మహత్య

#BJPLeader

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బిజెపి శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. స్థానిక సమాచారం ప్రకారం, మధుకర్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారు.

రాజకీయ ఒత్తిళ్లు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు ఆయనను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేయడంతో తీవ్ర నిరాశకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధుకర్ మృతిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “రాజకీయ కక్షలతో నిరపరాధ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం విచారకరం” అని ఖండించారు.

కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నీల్వాయి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Related posts

బకాయిల కోసం ఎదురు చూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై

Satyam News

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News

ప్రపంచ సినిమా పండుగలో వంతుకు అవార్డులు

Satyam News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Satyam News

స‌ర్ విజ్జీ స్టేడియంను ప‌రిశీలించిన గోవా గ‌వ‌ర్న‌ర్

Satyam News

Leave a Comment