కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు తగ్గింపుతో ప్రయోజనాలు తెలియజేయడానికి జిఎస్టి స్టేట్ టాక్స్ ఉయ్యూరు సర్కిల్ ఆధ్వర్యంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ – ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్ ” ఉయ్యూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య ప్రార్థన మందిరంలో ఘనంగా ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ వ్యాపార సంస్థలతో గృహోపకరణాలు ఇతర వినియోగ వస్తువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన లో జీఎస్టీ తగ్గింపు ధరలతో పాటు పలు ఆఫర్స్ తో అమ్మకాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో కూటమికి ప్రభుత్వం ద్వారా అమలులో వచ్చిన జీఎస్టీ తగ్గింపు అంశంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎస్టీ తగ్గింపు అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు.