మహబూబ్ నగర్ హోమ్

ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

#InternationalGirlsDay

ఈ రోజు మల్దకల్ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం నందు మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో  అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి డి సునంద హాజరై మాట్లాడుతూ బాలికలకు అంతర్జాతీయ బాలిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు (విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం)పై, వివక్షతపై అవగాహన పెంచడం, అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ విద్యను అందించడం చాలా ముఖ్యం. బాల్య వివాహాల వంటి ఆచారాలను అరికట్టడమే కాకుండా సమాజాభివృద్ధికి మార్గం సుగమం చేయడమే బాలికల దినోత్సవ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

జిల్లా విద్యా శాఖ అధికారి విజయ లక్ష్మి మాట్లాడుతూ ముందుగా బాలికలందారికి అంతర్జాతీయ బాలిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే పెళ్లిలు చేయడం చట్ట రీత్యా నేరం అని చెప్పారు, అమ్మాయిలకు 18 సంవత్సరాలు పూర్తిగా నిండిన తర్వాతనే వివాహం చేసుకోవాలని అన్నారు, అయితే ఇలా బాల్య వివాహం చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా 1098 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లల కోసం ఈ బాల రక్ష భవన్ ఏర్పాటు చేశారని, బాల రక్ష భవన్ అందిచే సేవలు గురించి వివరించారు. వివిధ ఆట పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమలత, డిసిపిఒ నరసింహ, జిసిడిఓ హంపయ్య, ఎంఈఓ సురేష్, కేజీబీవీ ఎస్ఓ విజయ లక్ష్మి, ఏఎస్ఐ ఈశ్వరయ్య, ఐసీపీఎస్ సిబ్బంది సురేష్, ప్రకాష్, శివ, పద్మ, ఉమెన్ హబ్ సిబ్బంది, చిల్డ్ లైన్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Related posts

వైజాగుకు వైకాపా తలాక్!

Satyam News

24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసు పరిష్కారం

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

Leave a Comment

error: Content is protected !!