ప్రత్యేకం హోమ్

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ ప్రశంసతో లోకేష్ మంత్రిగా చేసిన దక్షత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ‘జీఎస్టీపై అవగాహన కల్పించడంలో ఏపీనే దేశానికి మోడల్’ అని ప్రధాని కొనియాడటం, టీడీపీ-బీజేపీ కూటమి బలాన్ని మరింత పెంచింది.

ముఖ్యంగా, ‘డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర సమన్వయం ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి రాజకీయ పతాక శీర్షికగా మారాయి.

లోకేష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రచారం అత్యధికంగా 98,985 ఈవెంట్లతో, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలతో కూడిన వినూత్న విధానానికి నిదర్శనం. క్లిష్టమైన పన్ను సంస్కరణలను సామాన్యుడికి, విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించిన ఈ ‘గ్రాస్ రూట్’ అప్రోచ్‌ను దేశ ఎకనామిక్స్ టైమ్స్ పత్రికలు సైతం ప్రశంసించాయి. ఈ మోడల్ విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం ఇతర రాష్ట్రాలకు కూడా సిఫారసు చేసింది.

దీని ఫలితంగా ఉత్తరప్రదేశ్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏపీ విధానాన్ని అనుకరించడం, లోకేష్ ఇన్నోవేటివ్ అడ్మినిస్ట్రేషన్‌కు ప్రచారానికి దక్కిన అతిపెద్ద గుర్తింపు.

ప్రధాని ప్రశంసలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్‌లో ‘వెల్ డన్ లోకేష్’ అంటూ వీడియోలు లక్షల వ్యూస్ సాధించాయి. లోకేష్, కర్ణాటక ఐటీ మంత్రిపై చమత్కారంగా చేసిన ‘ఆంధ్ర ఫుడ్ స్పైసీ, మా ఇన్వెస్ట్‌మెంట్లు కూడా స్పైసీనే’ అనే ట్వీట్ సైతం వైరల్ చర్చకు దారితీసింది.

రాజకీయంగా ఈ ప్రశంసలు ఎన్డీఏ కూటమికి బ్రహ్మాస్త్రంగా మారాయి. జీఎస్టీపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా లోకేష్‌ను పాలసీ ఇంప్లిమెంటర్గా హైలైట్ చేయడం ద్వారా బీహార్ నుండి త్వరలో రాబోయే.. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి బలంగా పునాది పడింది.

లోకేశ్ కు దొరికిన అసాధ్యం అనుకున్న అసైన్మెంట్లతో.. సాధ్యం చేస్తూ.. వీలైతే యోగా లాంటి ఈవెంట్స్ విజయవంతం చెయ్యడమే కాకుండా వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసేలా నిర్వహించాడు. కట్ చేస్తే.. అల్లాడిస్తున్నాడు, సాక్షాత్తు ప్రధాని మోడీని మెప్పిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు.

జాతీయ స్థాయిలో.. లోకేశ్ అన్ స్టాపబుల్ ఎన్డీఏ తరుపుముక్కగా అవతరించాడు. ఏది ఏమైనా.. ఈ మన్ననలతో.. చొరవగా.. మనకు లోకేశ్ సాధిస్తున్న / తెస్తున్న పెట్టుబడులు మన రాష్ట్రానికి ప్రపంచ పటంలో బ్రాండ్ క్రియేట్ అవ్వడం సంతోషించతగ్గ విషయం.

Related posts

నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?” టైటిల్ లోగో లాంచ్

Satyam News

‘నకిలీ మద్యం’ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్‌?

Satyam News

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News

Leave a Comment

error: Content is protected !!