పులివెందుల జడ్పీటీసీగా తాజా ఎన్నికల్లో విజయాన్ని సాధించిన మారెడ్డి లతా రెడ్డి ఈరోజు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, పులివెందుల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయండి.
అభివృద్ధి ద్వారా అందరి నమ్మకాన్ని మరింత బలపరచండి. ఈ గెలుపు మీకే కాకుండా పులివెందుల ప్రజలకూ గర్వకారణం అయ్యింది.” అని అభినందనలు తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి మాట్లాడుతూ “పులివెందుల ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయాన్ని సాధించగలిగాను. నారా భువనేశ్వరి అందించిన ప్రోత్సాహం, ఆశీర్వాదాలు నాకు మరింత బాధ్యతను కల్పించాయి. ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. అభివృద్ధి సాధనకై నిరంతరం కృషి చేస్తాను” అన్నారు.