మహబూబ్ నగర్ హోమ్

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ అన్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ మాట్లాడుతూ… చీకటి నుంచి వెలుగులోకి… చెడుపైన మంచి… దుష్టశక్తులపైన దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగను ఆనందోత్సాహాలతో కుటుంబసభ్యుల మధ్య జరుపుకోవాలని కోరారు.

పండగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండగను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలిగి ప్రతి ఇంటా కోటి ఆనంద దీపాలు వెలగాలని కలెక్టర్ బాదావత్​ సంతోష్​ ఆకాంక్షించారు.

Related posts

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News

దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐలమ్మ

Satyam News

విధ్వంసం నుంచి వికాసం వైపు వెళుతున్నాం….

Satyam News

Leave a Comment

error: Content is protected !!