ప్రకాశం హోమ్

ఒంగోలులో ‘స్నేహ’ సేవా కార్యక్రమం

ప్రతి నెలా సేవా కార్యక్రమాలు నిర్వహించే స్నేహ బృందం తమ 52వ నెల ఛారిటీ కార్యక్రమాన్ని ఒంగోలు, రామ్ నగర్ 3వ లైన్‌లోని బాల సదనం (అనాథ శరణాలయం)లో ఘనంగా నిర్వహించింది. ఈ దీపావళి పండుగ సందర్భంగా అనాథ పిల్లల మొహాల్లో సంతోషం నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా అనాథ శరణాలయంలోని పిల్లలకు స్నేహ బృందం సభ్యులు కొత్త స్కూల్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిళ్లు, వారికి అవసరమైన చెప్పులు పంపిణీ చేశారు. దీపావళి సందర్భంగా అందరికీ స్వీట్ బాక్సులు, పండ్ల పంపిణీతో పాటు ఉదయం అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా ఏర్పాటు చేశారు. స్నేహ బృందం సభ్యులు పిల్లలతో సరదాగా కొంత సమయం గడిపి, వారిని ఉత్సాహపరిచారు.

“దీపావళి పండుగ ఆనందాన్ని ఆ పిల్లలతో పంచుకోవడం మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది” అని నిర్వాహకులు తెలిపారు. ప్రతి మాస కార్యక్రమములో భాగముగా, ఈ నెల కూడా మడనూరు గోసంఘానికి పశువుల దానాన్ని ఏర్పాటు చేశారు.

“ఐకమత్యమే మన బలం. చేయి చేయి కలుపుదాం, ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న స్నేహ బృందం.. భవిష్యత్తులో కూడా తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని, మిత్రులందరూ భాగస్వాములు కావాలని కోరింది.

Related posts

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్… సూపర్ హిట్

Satyam News

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News

విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు

Satyam News

Leave a Comment

error: Content is protected !!