పశ్చిమగోదావరి హోమ్

ఏలూరులో హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన

#Eluru

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జ్‌గా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. సురేష్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి బుధవారం ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, గౌరవ న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం. రామకృష్ణంరాజు, రెండవ అదనపు జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని, ఐదవ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.ఎస్. మురళీకృష్ణ, ఏడవ అదనపు జిల్లా జడ్జి వై. శ్రీనివాసరావు, ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఐ. శ్రీనివాసమూర్తి, ఫోక్సో స్పెషల్ జడ్జ్ కె. వాణిశ్రీ, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. అలాగే జిల్లా అదనపు ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, ఎస్‌బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు తదితర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

Satyam News

Leave a Comment

error: Content is protected !!