ఆధ్యాత్మికం హోమ్

దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి అనిత

#VangalapudiAnita

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, క్యూ లైన్లలో భక్తులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, “శ్రీ బాలాత్రిపురసుందరీ అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఉత్సవాల ఏర్పాట్లు ఎంతో బాగున్నాయి. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించారు” అని తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని, ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లపాటు కొనసాగాలని దుర్గమ్మను ప్రార్థించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంపై సైకోలు కళ్ళు పడకూడదని కూడా దుర్గమ్మను వేడుకున్నట్టు ఆమె తెలిపారు.

Related posts

అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి

Satyam News

ఏపీకి కేంద్ర కేబినెట్‌ మరో గుడ్‌ న్యూస్‌

Satyam News

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

Satyam News

Leave a Comment

error: Content is protected !!