కడప హోమ్

మీ గెలుపు మాకు గర్వకారణం

#MareddyLatareddy

పులివెందుల జడ్పీటీసీగా తాజా ఎన్నికల్లో విజయాన్ని సాధించిన మారెడ్డి లతా రెడ్డి  ఈరోజు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, పులివెందుల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయండి.

అభివృద్ధి ద్వారా అందరి నమ్మకాన్ని మరింత బలపరచండి. ఈ గెలుపు మీకే కాకుండా పులివెందుల ప్రజలకూ గర్వకారణం అయ్యింది.” అని అభినందనలు తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి  మాట్లాడుతూ “పులివెందుల ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయాన్ని సాధించగలిగాను. నారా భువనేశ్వరి అందించిన ప్రోత్సాహం, ఆశీర్వాదాలు నాకు మరింత బాధ్యతను కల్పించాయి. ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. అభివృద్ధి సాధనకై నిరంతరం కృషి చేస్తాను” అన్నారు.

Related posts

డొనాల్డ్ ట్రంప్ కు భంగపాటు

Satyam News

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి

Satyam News

ఆర్ధిక నేరంలో అందమైన భామల విచారణ లేదు…

Satyam News

Leave a Comment

error: Content is protected !!