మహబూబ్ నగర్హోమ్

సమాచార హక్కు చట్టం అమలులో విశిష్ట పురస్కారం

#RTI act

సమాచార హక్కు చట్టం-2005ను సమర్థవంతంగా అమలుపరిచినందుకుగాను తెలంగాణ సమాచార కమిషన్ అందించే “Best Performing Public Information Officer (PIO)” పురస్కారాన్ని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖాధికారిణి (DEO) ఐ.విజయకుమారి అందుకున్నారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. సమాచార హక్కు చట్టం ప్రధాన లక్ష్యాలైన పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజలకు సమాచారాన్ని సత్వరమే అందుబాటులో ఉంచడంలో చూపిన విశేష ప్రతిభకు గానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా డీఈఓ ఐ. విజయకుమారికి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని పురస్కారాలు, విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related posts

ఇంద్రకీలాద్రిపై  సామూహిక అక్షరాభ్యాసాలకు సర్వం సిద్ధం

Satyam News

మనసు దోచుకున్న మహిళా క్రికెటర్లు

Satyam News

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ

Satyam News

అమెరికా సుంకాల తగ్గింపు…ఎందుకో తెలుసా?

Satyam News

కోల్డ్ వేవ్ తో అల్లాడుతున్న ఉత్తరాది రాష్ట్రాలు

Satyam News

ప్రభుత్వ సేవలకు రేటింగ్స్

Satyam News

Leave a Comment