సమాచార హక్కు చట్టం-2005ను సమర్థవంతంగా అమలుపరిచినందుకుగాను తెలంగాణ సమాచార కమిషన్ అందించే “Best Performing Public Information Officer (PIO)” పురస్కారాన్ని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖాధికారిణి (DEO) ఐ.విజయకుమారి అందుకున్నారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. సమాచార హక్కు చట్టం ప్రధాన లక్ష్యాలైన పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజలకు సమాచారాన్ని సత్వరమే అందుబాటులో ఉంచడంలో చూపిన విశేష ప్రతిభకు గానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది.
ఈ సందర్భంగా డీఈఓ ఐ. విజయకుమారికి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని పురస్కారాలు, విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
