చీటీల పేరుతో పలువురి నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూళ్లు చేసి ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన మోసగాడి ఉదాంతం వెలుగులోనికి వచ్చింది.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామానికి చెందిన ఎలుబండి చక్రపాణి అనేక కుటుంబాల వద్ద నుంచి చీటీల పేరుతో సొమ్ము కాజేసి ఊరు విడిచిపెట్టి ఏలేశ్వరం పట్టణానికి మకాం మార్చేసాడు. దీంతో బాధితులు పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చక్రపాణికి గ్రామంలో సొంత ఇల్లు, పొలం ఉన్నందున అతనిని నమ్మడం జరిగిందని బాధితులు ఎస్సై మౌనిక కు వివరిస్తూ సుమారు 100 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.