సినిమాహోమ్

దర్శకుడు పిసి ఆదిత్య కు దాసరి నారాయణరావు స్మారక పురస్కారం

#PCAditya

నిత్య ప్రయోగశీలి విలక్షణ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు మే నాలుగో తేదీ దాసరి నారాయణరావు 79వ జయంతి సందర్భంగా దాసరి స్మారక పురస్కారం అందజేశారు. దాసరి తన 30 సంవత్సరాల సినీ ప్రయాణంలో 100 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు.

దాసరి స్ఫూర్తితో విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశాలి డాక్టర్ పిసి ఆదిత్య 100 రోజుల్లో 100లకు చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేగాక సింగపూర్ యూనివర్సిటీ వారు ఇచ్చిన గౌరవ డాక్టరేట్ ను దాసరి చేతుల మీదుగా ఆదిత్య అందుకోవడం విశేషం.

నేడు దాసరి 79వ జయంతి సినీ రంగానికి డైరెక్టర్స్ డే. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన టాలీవుడ్ దాసరి ఫిలిం ఫెస్టివల్ లో సంస్థ నిర్వాహకులు కే మోహన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రధాన భాగంగా దాసరి స్మారక పురస్కారాన్ని దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు మరో దర్శకుడు చంద్ర మహేష్, సీనియర్ నటుడు ఘర్షణ శ్రీనివాస్ తదితరులు అందజేసి ఆదిత్యను అభినందించారు.

కీర్తి రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై దర్శక నిర్మాత డాక్టర్ రావుల మోహన్ రెడ్డి నిర్మించిన సంచలనాత్మక లఘు చిత్రం తెరపై కనిపించే ఏకైక పాత్ర వంతులో డాక్టర్ పి సి ఆదిత్య అసమాన నటనకు ముగ్దలైన అతిధులు దాసరి స్మారక పురస్కారoఅందజేసి అభినందించారు.

ఆదిత్య తన 30 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎందరో నూతన కళాకారులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇచ్చి దాసరి బాటలో పయనిస్తున్నారని నేడు దాసరి స్మారక పురస్కారానికి ఆదిత్య అర్హులని ప్రశంసించారు. అవార్డు గ్రహీత ఆదిత్య స్పందిస్తూ దాసరి స్వర్గం నరకం చిత్రంలో అంతా కొత్త వారికి అవకాశం ఇచ్చారని అదే స్ఫూర్తితో త్వరలో తాను కూడా పూర్తిగా కొత్త వారితో అలాంటి చిత్రాన్ని నిర్మించి దాసరికి అంకితం ఇస్తానని హామీ ఇచ్చారు.

Related posts

మకరజ్యోతి దర్శనంతో తరించిన భక్తులు

Satyam News

లక్షలాది రూపాయల దుర్వినియోగంపై సీఎంకు ఫిర్యాదు

Satyam News

జల్సాల జగన్ బూట్ల ఖరీదు రూ 2 లక్షలు!

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

మెరుస్తున్న కలలకు వాస్తవ రూపం

Satyam News

బిజెపిలో చేరనున్న సినీ నటి ఆమని

Satyam News

Leave a Comment