సినిమాహోమ్

దర్శకుడు పీసీ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్

#PCAditya

విలక్షణ దర్శకుడు, సినీ రంగం లో నిత్య ప్రయోగశీలి పీసీ ఆదిత్య గత 30 సంవత్సరాలుగా  చేస్తున్న సేవలను, ప్రయోగాలు ను గుర్తించి న్యూ మెక్సికో USA కు చెందిన WORLD TECHNOLOGY RESEARCH &DEVELOPMENT COUNCIL వారు పీసీ ఆదిత్య కు అత్యున్నత గౌరవ డాక్టరేట్ ను అందించారు.

పీసీ ఆదిత్య గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఇది రెండవ సారి. పదేళ్ల క్రితం సింగపూర్ ఓపెన్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అందజేశారు. ఇప్పుడు రెండవ సారి అమెరికా నుండి అందుకోవడం తెలుగు సినీ దర్శకుడిగా ఆదిత్య సినీ రంగానికే గర్వ కారణం గా నిలిచారు.

ఈ సందర్బంగా పీసీ ఆదిత్య స్పందిస్తూ తన సుదీర్ఘ సినీ ప్రయాణం లో అత్యున్నత  గౌరవ డాక్టరేట్ ను అందుకోవడం తన ప్రయోగాలకు మరింత ఉత్సాహం ని ఇచ్చిందని, భవిష్యత్ లో మరికొంత మందిని సినీ రంగానికి పరిచయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిత్య మరోసారి గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల ఆయన అభిమానులు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేసారు.

Related posts

షాడో గుప్పిట్లో మెడికల్ కాలేజీ విలవిల

Satyam News

లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

Satyam News

లండన్ లో ఎండల తీవ్రత: అల్లాడిపోతున్న జనం

Satyam News

ఫేస్ బుక్, వాట్స్ యాప్ లకు ‘సుప్రీం’ అక్షింతలు

Satyam News

బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా

Satyam News

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

Satyam News

Leave a Comment