హైదరాబాద్హోమ్

తెలంగాణ పోలీస్ అకాడమీలో మహారాష్ట్ర పోలీస్ ల స్టడీ విజిట్

#CVAnand

పోలీస్ శిక్షణలో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి పరస్పరం పంచుకునే లక్ష్యంతో మహారాష్ట్ర పోలీస్ అకాడమీ, నాసిక్కు చెందిన ఔట్‌డోర్ అధికారుల బృందం డీఎస్పీ సంతోష్ గాయకే నాయకత్వంలో మూడు రోజుల స్టడీ విజిట్ కోసం RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించింది.

ఈ సందర్భంగా బృందం అకాడమీ డైరెక్టర్  అభిలాష బిస్త్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వారు తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీలు, ప్రొబేషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్లకు అందిస్తున్న బేసిక్ ఔట్‌డోర్ శిక్షణ విధానం, ట్రైనింగ్ కరికులం, సిలబస్, శిక్షణా పద్ధతులు  మరియు అమలు విధానాన్ని  అధ్యయనం చేసి, వాటిలోని ఉత్తమ అంశాలను మహారాష్ట్ర పోలీస్ అకాడమీలో అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ స్టడీ విజిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మొదటి రోజు పర్యటనలో అకాడమీ ఔట్‌డోర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించగా, డీఎస్పీ కృష్ణ లైజన్ అధికారిగా వ్యవహరించి బృందానికి అన్ని విభాగాలను సందర్శించేలా సమన్వయం చేశారు.

అధికారుల బృందం ఉదయం నిర్వహించిన మార్నింగ్ పరేడ్ ను పరిశీలించి, ట్రైనీలకు అందిస్తున్న ఔట్‌డోర్ శిక్షణ, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధానాలు, అలాగే అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్, డ్రిల్ ఇన్స్ట్రక్టర్ అనుసరిస్తున్న శిక్షణా ప్రమాణాలను పరిశీలించారు.  ముఖ్యంగా శారీరక శిక్షణ సమయంలో గాయాలు జరగకుండా అనుసరిస్తున్న ఆధునిక భద్రతా పద్ధతులను ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.

అనంతరం అకాడమీ డా. హ్యాంకిన్స్ మ్యూజియంను సందర్శించిన బృందం, పోలీసు దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్, బాంబ్ డిటెక్షన్ & డిస్పోజల్‌కు సంబంధించిన ప్రయోగశాలలు, ప్రదర్శన విభాగాలను పరిశీలించి వాటి నిర్వహణపై ప్రశంసలు వ్యక్తం చేసింది.

సాయంత్రం అకాడమీ యూనిట్ హాస్పిటల్ను సందర్శించిన బృందం, వైద్యాధికారి డాక్టర్ రమాదేవితో సమావేశమైంది. ట్రైనీ అధికారులు అకాడమీలో చేరిన మొదటి రోజు నుండి శిక్షణ పూర్తయ్యే వరకు వారి ఆరోగ్య పర్యవేక్షణ, వైద్య పరీక్షలు, మెడికల్ రికార్డుల నిర్వహణ, అనుసరిస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) గురించి డాక్టర్ రమాదేవి వివరించారు. ట్రైనీల ఆరోగ్య భద్రతకు తెలంగాణ పోలీస్ అకాడమీ ఇస్తున్న ప్రాధాన్యతను మహారాష్ట్ర బృందం అభినందించింది.

అలాగే ఫైరింగ్ రేంజ్‌లు, క్రీడాభవన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, పరేడ్ గ్రౌండ్స్ తదితర శిక్షణా సదుపాయాలను సందర్శించిన అధికారులు, అకాడమీలో ఉన్న ఆధునిక మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణా వ్యవస్థ, అత్యుత్తమ ఔట్‌డోర్ ఫ్యాకల్టీ అందిస్తున్న శిక్షణను ప్రశంసించారు.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీ శిక్షణా విధానం, అత్యాధునిక మౌలిక వసతులు, సమగ్ర ట్రైనింగ్ మోడల్ దేశంలోని ఇతర పోలీస్ శిక్షణా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మహారాష్ట్ర పోలీస్ అకాడమీ అధికారులు పేర్కొన్నారు.

ఈ స్టడీ విజిట్‌లో డీఎస్పీ కృష్ణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు నహేర్, రామకృష్ణ తదితరులు బృందానికి అకాడమీ వివిధ విభాగాలను సందర్శించి, ఆయా శిక్షణా అంశాలను వివరించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ స్టడీ విజిట్‌లో తెలంగాణ పోలీస్ అకాడమీ అమలు చేస్తున్న ఉత్తమ శిక్షణా విధానాలను మహారాష్ట్ర అధికారుల బృందం సమగ్రంగా అధ్యయనం చేయనుంది.

Related posts

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

Satyam News

బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చేందుకు సంకల్పం తీసుకుందాం

Satyam News

వైమానిక సంస్థను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Satyam News

దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

Satyam News

Leave a Comment