సినిమాహోమ్

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి

#NewMovie

జి.ఎస్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి.శైలజా రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణపు ప్రేమకథాచిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వినూత్న ప్రేమ కథాచిత్రం షూటింగ్ కి ముందే పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని సంగీత సౌరభాలు వెదజల్లుతోంది. పవన్ మహావీర్ సరసన సుహాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని మరో హీరోయిన్ ను త్వరలో రివీల్ చేస్తారు.

ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్వర సారధ్యంలో… దర్శకుడు శివాల ప్రభాకర్ సమకూర్చిన సాహిత్యానికి సుప్రసిద్ధ గాయనీగాయకులు చిత్ర, హరిణి, బృంద, అరుణ్, సాయి చరణ్, కృష్ణ తేజస్వి గాత్రమందించారు.  హైదరాబాద్, సారధి స్టూడియోలో అత్యంత ఘనంగా అతిరథమహారధుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈనెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. రాజమండ్రి సమీపంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పట్టిసీమలో ప్రారంభమయ్యే ఈ షూటింగ్ తదుపరి వైజాగ్, అరకు ప్రాంతాలకు షిఫ్ట్ కానుంది.

జి.ఎస్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత్రి శ్రీమతి జి.శైలజా రెడ్డి మాట్లాడుతూ…. “మా దర్శకుడు శివాల ప్రభాకర్ ఒక యజ్ఞంలా ఈ చిత్ర రూపకల్పన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీత సారధ్యంలో ప్రభాకర్ రాసిన పాటలు అద్భుతంగా కుదిరాయి. హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్ కు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది” అని అన్నారు.

సీనియర్ హీరో సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎడిటర్: నందమూరి హరి, రచనా సహకారం: రమేష్ – మురళి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజా రెడ్డి, కథ – మాటలు – పాటలు – చిత్రానువాదం – దర్శకత్వం: శివాల ప్రభాకర్

Related posts

వైకాపాకు షాక్ – సర్దుకొంటున్న సీనియర్లు!

Satyam News

గీతా కృష్ణపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Satyam News

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు

Satyam News

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు విస్తృత ప్రణాళిక

Satyam News

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News

భారత్ ను ముంచెత్తనున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు?

Satyam News

Leave a Comment