రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడేషన్లు ఇస్తామని సమాచార శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ హామీ ఇచ్చారు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమాచార శాఖ కమిషనర్ కేఎస్ విశ్వనాధాన్ని ప్రతినిధుల బృందం కలిసి జర్నలిస్టుల సమస్యలు కొత్త అక్రిడేషన్ల అంశాలను సుదీర్ఘంగా సంచాలకులతో చర్చించారు
ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, ఉపాధ్యక్షులు చావా రవిల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం సమాచార శాఖ సంచాలకులను కలిసి వినతిపత్రం సమర్పించారు
రాష్ట్రంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, దీనికి ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కమిటీ, వెల్ఫేర్ ఫండ్ కమిటీ వంటి వివిధ జర్నలిస్ట్ ప్రొఫెషనల్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు వాటిల్లో గతంలో మాదిరిగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను, ఆయా కమిటీల్లో నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
పాత్రికేయులు, యాజమాన్యాల భాగస్వామ్యంతో పత్రికలకు మీడియా సంస్థలకు ప్రభుత్వం జారీ చేసే ప్రకటన బిల్లుల నుండి ఐదు శాతం మినహాయించి జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్కు జమచేసి బలోపేతం చేయాలని కోరారు. ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు వ్యవస్థను గతంలో మాదిరిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పటిష్టం చేసి అవసరమైన బడ్జెట్ లు కేటాయించాలని కోరారు .అకాడమీ నియమావళి ప్రకారం వివిధ కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా గవర్నింగ్ కౌన్సిల్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో నియమించాలని విన్నవించారు.
వృత్తిలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు, ఫోటో జర్నలిస్టులను, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిని ప్రోత్సహించేందుకు వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈమధ్య నిలిపివేసిన రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు .
అలాగే సుదీర్ఘకాలం వృత్తిలో సేవలు అందించిన సీనియర్ పాత్రికేయులను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించే ఆరవాయితీని తిరిగి ప్రారంభించాలని కోరారు .పాత్రికే వృత్తిలో శిక్షణ నైపుణ్యం పెంపొందించుకోవడానికి వీలుగా ఉన్నత విద్యాభ్యాసానికి వృత్తి పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయాలని సంచాలకులను విజ్ఞప్తి చేశారు.
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి, పథకం అమలను పర్యవేక్షించడానికి వీలుగా సమాచార శాఖ ,ఆరోగ్యశ్రీ ట్రస్ట్, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో ఒక త్రైపాక్షగా కమిటీని నియమించాలని సూచించారు. 2016లో ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేసి గత ప్రభుత్వం నిలిపివేసిన వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.
వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్ట్ కేటగిరీల సిబ్బందికి వేజ్ బోర్డు సిఫారసుల ప్రకారం వేతనాలు అమలు చేయడానికి వీలుగా కార్మిక శాఖ ద్వారా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. వేజ్ బోర్డు సిఫార్సులు పర్యవేక్షించడానికి చట్ట ప్రకారం గతంలో మాదిరిగా త్రైపాక్షగా కమిటీలను ఏర్పాటు చేయాలని సంచాలకులను కోరారు .
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన, మీడియా సంస్థలపైన దాడులు అరికట్టడానికి మహారాష్ట్ర తరహాలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలని విన్నవించారు. కరోనాకాలంలో రద్దయిన జర్నలిస్టుల రైల్వే రాయితీ ప్రయాణ సదుపాయాన్ని పునరుద్ధరించదానికి కేంద్రంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు .
చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ కొనసాగటానికి వీలుగా ఆయా సంస్థలకు రొటేషన్ పద్ధతి పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార ప్రకటనలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు .దేశంలో పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా వయోభారంతో వృత్తి నుండి విరమించుకున్న వయోధిక పాత్రికేయులకు పింఛన్ సదుపాయాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్తో నిమిత్తం లేకుండా సీనియార్టీ ప్రాతిపదికన పనిచేస్తున్న పాత్రికేయులు అందరికీ అదే విధంగా ఇటీవల వృత్తి నుండి విరమణ చేసిన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ,అదే విధంగా కేటాయింపులు చేయాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతర పాత్రికేయులకు సమీప మైదాన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని అందుకని జారీ చేసిన ఇళ్ల స్థలాల జీవాలను సవరించాలని సమాచార శాఖ సంచాలకులకు విజ్ఞప్తి చేశారు.వీటిపై సమాచార శాఖ సంచాలకులు విశ్వనాథం సానుకూలంగా స్పందించారు
వీటిపై తక్షణమే సమావేశాలు నిర్వహించి అందరికీ అనుగుణమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ దాసరి నాగరాజు ఏపీడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏడుకొండలు తదితర నాయకులు హాజరయ్యారు