జాతీయంహోమ్

హెయిర్ స్టైల్ వివాదం లో రూ 25 లక్షల పరిహారం

ముంబైకి చెందిన ఒక మోడల్ హెయిర్ కట్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో సదరు మోడల్ హెయిర్ కట్ కోసం ఐటీసీ (ITC) హోటల్‌లోని సెలూన్‌కు వెళ్లగా, అక్కడ సిబ్బంది ఆమె జుట్టును సరిగ్గా కత్తిరించలేదు. దీనివల్ల తన జుట్టు పాడైందని, ఫలితంగా అనేక వృత్తిపరమైన అవకాశాలను మరియు మోడలింగ్ కాంట్రాక్టులను కోల్పోయానని ఆమె కన్జూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును విచారించిన వినియోగదారుల కమిషన్ 2021లో ఆమెకు రూ. 2 కోట్ల భారీ పరిహారాన్ని ప్రకటించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ ఐటీసీ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం, గతంలో ప్రకటించిన పరిహారం మొత్తాన్ని సవరిస్తూ బాధితురాలికి రూ. 25 లక్షలు చెల్లించాలని ఐటీసీ హోటల్‌ను ఆదేశించింది. వృత్తిపరమైన నష్టాన్ని గుర్తించినప్పటికీ, పరిహారం మొత్తం సహేతుకంగా ఉండాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ రివైజ్డ్ తీర్పును ఇచ్చింది.

Related posts

తిరుగుబాటు చేసి బలి అయిన కవిత

Satyam News

మరిడి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Satyam News

యూరియా కొరతకు కారణం ఏమిటి

Satyam News

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News

విజయవాడ ఉత్సవ్‌ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Satyam News

ఏఐలో దేశంలోనే ఏపీ టాప్‌…. లోకేష్‌కి కేంద్ర మంత్రి కితాబు

Satyam News

Leave a Comment