పులివెందులలో టీడీపీ గెలుపు..ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం కలిగించింది. దాదాపు 3 దశాబ్ధాలకుపైగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందుల ఇప్పుడు బీటలు వారింది. సాక్షాత్తు వై.ఎస్.జగన్ ఎమ్మెల్యేగా పులివెందుల ZPTC స్థానంలో వైసీపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటే ఇది మామూలు పరాజయం కాదు.
ఐతే ఈ విజయం వెనుక లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన లోకేష్..వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారు. ఇదే మాట వైసీపీ నేతల అంతర్గత చర్చల్లోనూ వినిపిస్తోంది. చంద్రబాబుకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ ముందుకెళ్తున్నారు లోకేష్. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రత్యర్థుల పట్ల సాఫ్ట్‌గా వ్యవహరిస్తారన్న పేరుంది.
కానీ లోకేష్ అలా కాదు. ఎదురుదాడే. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. ఈ ధైర్యమే ఇప్పుడు కార్యకర్తల్లో ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తన మార్కు చూపించడం ప్రారంభించారు లోకేష్. తండ్రిని జైలులో వేసిన పరిస్థితులను చూసి మరింత రాటు దేలారు లోకేష్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తలను, టీడీపీ నేతలను వేధించిన వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు లోకేష్.
రెడ్‌బుక్ పేరుతో వైసీపీ నేతలకు భయం పుట్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేట మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు వైసీపీ తరపున మాట్లాడే నేతలే కరవయ్యారు. పేర్ని నాని, అంబటి మినహా మిగతా నేతలంతా కలుగుల్లోకి వెళ్లిపోయారు. ఇదంతా లోకేష్ పుట్టించిన భయమే. చివరికి ఆ పార్టీకి పెద్ద దిక్కుగా చెప్పుకునే సజ్జల సైతం సైలెంట్ అయిపోయారు. నారా లోకేష్..డిఫెన్సివ్ రాజకీయాలను నమ్ముకోవడం లేదు.
హిట్టింగ్‌నే నమ్ముకున్నారు. మొదట్లో ఆయన చాలా సాఫ్ట్‌గా కనిపించారు. ఆయనను చూసి చాలామంది ఈ రాజకీయాల్లో లోకేష్ నెగ్గుకురాలేడేమో అన్నారు. కానీ రోజులు గడిచినకొద్దీ లోకేష్ పదునుపెట్టిన వజ్రంలా తయ్యారయ్యాడు. వైసీపీ నేతల అరాచకాలకు తగ్గట్లుగానే కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. వైసీపీకి దడ పుట్టిస్తున్నారు. ఇప్పుడు లోకేష్..పేరు వింటేనే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకుంటున్నారు.