హైదరాబాద్హోమ్

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

బీఆర్ఎస్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలా కాకుండా, “రీసైక్లింగ్ ప్లాంట్” లాగా మారిపోయింది. పాత బట్టలను మడతపెట్టి కొత్తవి అన్నట్టుగా, పాత టీఆర్ఎస్ బోర్డును తుడిచి, రంగులు మార్చి మళ్ళీ తేవడమే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తాజా కార్యక్రమం లా గా కనిపిస్తున్నది.

“బీఆర్ఎస్ అనేది ఏదో పాతకాలపు టీవీ రిమోట్ లాగా మొరాయిస్తోంది, కార్యకర్తలకు పాత టీఆర్ఎస్ కీబోర్డే బాగా అలవాటు” అంటూ బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల ఓ నివేదిక సమర్పించారు. జాతీయ స్థాయికి తీసుకెళ్తామని కేసీఆర్ ఊదరగొట్టిన ఆ ‘బీఆర్ఎస్’ బ్రాండ్‌ను, తనే స్వయంగా రీసైక్లింగ్ బిన్ లో వేసి, మళ్ళీ పాత టీఆర్ఎస్ కోసం తెగ తాపత్రయపడిపోయారు. అంటే, జాతీయ పార్టీ అన్నది కేవలం ఒక ‘ట్రయల్ రన్’ అన్నమాట!

అయితే, ఆయన చెల్లి కవిత ఈ ‘నేమ్-ఛేంజ్’ ఎపిసోడ్‌కు గట్టిగానే షాక్ ఇచ్చారు. ‘మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ’ అనే కామెడీ లెక్కన ఎందుకంత కష్టం అన్నయ్యకు అనుకుందేమో. తాజాగా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అంటూ పాత టీఆర్ఎస్ పునాదుల మీద, సమితిని తన ‘సమ్మెట’ దెబ్బలతో కొట్టి, దానిని ‘సేన’గా మార్చి కొత్త కుంపటిని రగిల్చారు.

ఈ రీసైక్లింగ్ రాజకీయంతో కార్యకర్తలకు పిచ్చెక్కడం ఖాయం. ఉదయం ఒక పేరుతో జెండా మోయాలి, మధ్యాహ్నానికి అది ‘బీఆర్ఎస్’ అవుతుంది, సాయంత్రానికి అది ‘సేన’గా మారుతుంది. చివరకు ఏ పేరుతో ‘జై’ కొట్టాలో తెలియక, గొంతులో గందరగోళం.. చేతిలో జెండా ఎటు ఊపాలో తెలియని అయోమయం!

Related posts

బందరు పోర్టు కు ఇప్పుడు ‘చంద్ర’ కళ

Satyam News

రామడుగులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

Satyam News

ఎగువ గొట్టివీడు యల్లమ్మ జాతరలో చాందిని బండి

Satyam News

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉంటుందో తెలుసా?

Satyam News

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News

Leave a Comment